శివ నామ స్మరణతో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు, సంగం, చెజర్ల, సోమశిలల్లోని పురాతన శివాలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి ఎక్కువైంది. ఆత్మకూరులోని శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి కల్యాణం ఘనంగా నిర్వహించనున్నారు. సంగం, చెజర్ల, సోమశిల శివాలయాలను అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు.
నెల్లూరులో ప్రసిద్ధి చెందిన శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలో ముగ్గులు వేసి, దీపాలు వెలిగించారు. ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన భక్తులు.. మొక్కులు చెల్లించుకున్నారు. పలుచోట్ల శివుడికి అభిషేకాలు నిర్వహించగా.. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. నగరంలోని నవాబుపేట, గుప్తా పార్క్ దగ్గరున్న శివాలయాలతోపాటు, రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం భక్తులతో రద్దీగా మారింది.