నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం మేల్చూరు గ్రామంలో తెదేపా నాయకురాలు దేవికా చౌదరి పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. భైవరం, మల్లెమాల గ్రామాల్లోనూ ఆమె ఈ కార్యక్రమం చేపట్టారు. లాక్డౌన్ నేపథ్యంలో ఇంటింటికీ వెళ్లి కూరగాయలు అందించారు. ఏప్రిల్ 1 నుంచి కొన్ని గ్రామాల్లో మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేస్తున్నామన్నారు. కరోనా పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.
మేల్చూరులో పేదలకు కూరగాయల పంపిణీ - nellore district
లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు పలుచోట్ల ప్రజా ప్రతినిధులు, దాతలు ముందుకు వస్తున్నారు. నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలంలో తెదేపా నాయకురాలు దేవికా చౌదరి పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు.
కూరగాయలు పంపిణీ చేసిన తేదేపా నాయకురాలు దేవికా చౌదరి