ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలవరం నిధుల జాప్యానికి చంద్రబాబే కారణం: ఉపముఖ్యమంత్రి - చంద్రబాబుపై ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి

ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు మద్యం విక్రయాలతో పేదల రక్తం తాగారన్నారు.

deputy cm narayana comments on chandrababu
ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి

By

Published : Nov 3, 2020, 12:28 PM IST

పోలవరం ప్రాజెక్టు విషయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన నిర్వాకంతోనే నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని... డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆరోపించారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట వచ్చిన ఉపముఖ్యమంత్రి... పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే పనిలో సీఎం జగన్ ఉన్నారన్నారు. చంద్రబాబు నాయుడు ప్యాకేజీ, కాంట్రాక్టులకు అలవాటు పడి ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. మద్యం విక్రయాలతో పేదల రక్తం తాగారంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలకు ఇచ్చిన హామీ మేరకు మద్యపాన నిషేధాన్ని దశల వారీగా చేస్తున్నారన్నారు. ప్రజ సంక్షేమానికి సీఎం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details