శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం కల్లూరు గ్రామంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. కొన్ని రోజులుగా డెంగ్యూ జ్వరంతో ప్రజలు మంచాన పడుతున్నారు. ఇప్పటికే 50 మందికి పైగా జ్వరాలతో బాధపడుతున్నారు. వీరంతా నాయుడుపేట, సూళ్లూరుపేట ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చికిత్స చేయించుకునేందుకు వేలకు వేలు ఖర్చుకావటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు కురుస్తున్న వేళ వైద్య బృందాలు గ్రామాల్లో పర్యటించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
నెల్లూరులో విజృంభిస్తున్న జ్వరాలు.. కానరాని వైద్య బృందాలు - dengue Fever spread in nellore news
నెల్లూరు జిల్లాలో కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో జ్వరాలు వ్యాపిస్తున్నాయి. బాధితులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వైద్య బృందాలు గ్రామాల్లో పర్యటించి తగు చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు వాపోతున్నారు.
నెల్లూరులో విజృంభిస్తున్న జ్వరాలు