ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోజురోజుకూ పెరుగుతున్న డెంగీ మృతులు - latest dengue fever news in nellore

డెంగీ జ్వరంతో మృతిచెందుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నివారణ చర్యలు చేపట్టాల్సిన ప్రజా ప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పారిశుధ్ధ్య నిర్వహణ లోపం... ప్రజలకు శాపంగా మారింది.

dengue fever effect in nellore district

By

Published : Nov 19, 2019, 8:41 PM IST

రోజురోజుకూ పెరుగుతున్న డెంగీ మృతులు

డెంగీ జ్వరంతో మృతిచెందుతున్న వారి సంఖ్య జిల్లాలో రోజురోజుకూ పెరుగుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు పారిశుధ్ధ్య నిర్వహణ లోపించి... విషజ్వరాలు ప్రబలుతున్నాయి. నెల్లూరు జిల్లా ఉమ్మాయపల్లి గ్రామంలో పుచ్చకట్ల రవి (26) అనే యువకుడు డెంగీ జ్వరంతో మృతిచెందాడు. ఈ ఘటన మరువకముందే మర్రిపాడు మండల కేంద్రంలోని బాలుపల్లిలో ఆఫియా(6) అనే చిన్నారి డెంగీతో మృతిచెందింది. సంగం మండలం మర్రిపాడు గ్రామంలో 2రోజుల క్రితం దుగ్గి విజయభాస్కర్ (26) జ్వరంతో మృతిచెందాడు. ఆత్మకూరు నియోజకవర్గంలోనూ డెంగీ జ్వరంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details