నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం పెద్ద అబ్భీపురం గ్రామంలో 25 కుటుంబాల వారు ఎన్నో ఏళ్ల తరబడి పశువులకు కొట్టాలు, గడ్డివాములు,ఎరువు దిబ్బలు వేసుకొని పాడి పశువుల మీద ఆధారపడి జీవిస్తున్నారు. కానీ ఆ గ్రామానికి కొత్తగా రైతు భరోసా కేంద్రం, గ్రామసచివాలయం, ప్రైమరీ హెల్త్ సెంటర్ మంజూరు అవటంతో... వీటి నిర్మాణం కోసం 25 కుటుంబాల వారు నిర్మించుకున్న పశువుల కొట్టాలను గడ్డివాములు, ఎరువు దిబ్బలను తొలగించమని అధికారులు నోటీసులు జారీ చేశారు.
రైతులు కోర్టుకు వెళ్లి స్టే కోసం ప్రయత్నించారు. స్టే వచ్చినా సకాలంలో పత్రం చేతికి అందకపోవటంతో అధికారులు, పోలీసులు బందోబస్తుతో వచ్చి గ్రామంలో పశువుల కొట్టాలను గడ్డివాములను, ఎరువు దిబ్బలను తొలగించారు. ఎన్నోఏళ్ల తరబడి ఉంటున్న గడ్డివాములను తొలగించటం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.