నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి పంచాయతీలో సర్పంచ్‌గా నామినేషన్ వేస్తే.. ముందు ప్రకటించిన జాబితాలో పేర్లు ఉన్నాయని, ఆ తర్వాత తొలగించారాని అభ్యర్థులు ఆందోళన చేశారు. ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించటంతో పాటు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు నెల్లూరులో వారు ప్రకటించారు. ఇస్కపల్లి పంచాయతీ ఎస్సీ రిజర్వేషన్ కావటంతో శంబన్ కులస్థులైన శీనయ్య, సుబ్రహ్మణ్యంలు సర్పంచి స్థానానికి నామినేషన్లు దాఖలు చేశారని చెప్పారు.
ఇస్కపల్లి పంచాయతీలో ఉద్దేశ పూర్వకంగా నామినేషన్ల తిరస్కరణ
ఇస్కపల్లి పంచాయతీలో సర్పంచ్‌గా నామినేషన్ వేస్తే.. అధికారులు ముందు జాబితాలో పేర్లు ప్రకటించారు. తర్వాత తొలగించారని అభ్యర్థులు ఆందోళన చేశారు. తమకు జరిగిన అన్యాయానికి ఎలక్షన్ కమిషన్ న్యాయం చేయాలని కోరుతున్నారు.
తమ వద్ద పాత కుల ధ్రువీకరణ పత్రాలు ఉండటంతో ఆర్డీఓను సంప్రందించి.. వాటితోనే నామినేషన్ వేశామని తెలిపారు. ముందుగా 17 మందితో అభ్యర్థులతో జాబిత ప్రకటించారు. గంట తర్వాత తమ పేర్లను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. శంబన్ కులమే అల్లూరులో లేనట్లు చెబుతున్నారని.. ఈ విషయాన్ని అధికారులు ముందు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఎన్నో ఏళ్లుగా శంబన్ కులస్థులుగా జీవిస్తున్న తమకు ప్రభుత్వ రాయితీలు అందుతున్నాయని.. ఇప్పుడు లేదనడంలో ఆంతర్యమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. తమకు జరిగిన అన్యాయానికి ఎలక్షన్ కమిషన్ న్యాయం చేయాలని కోరుతున్నారు.