ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అభిమాన నేతను చూడాలని.. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన టీడీపీ అభిమానులు - నెల్లూరు జిల్లా కందుకూరు చంద్రబాబు సభ

Kandukuru Deaths History : నెల్లూరు జిల్లా కందుకూరు చంద్రబాబు సభ తొక్కిసలాటలో మృతి చెందినవారంతా టీడీపీ కార్యకర్తలే. తమ అభిమాన నేతను చూసేందుకు వచ్చి...తోపులాటలో ప్రాణాలు విడిచారు. మృతి చెందిన వారందరిదీ నిరుపేద కుటుంబ నేపథ్యం కావడంతో విషాదఛాయలు అలుముకున్నాయి

తొక్కిసలాటలో మృతి
Kandukuru Deaths History

By

Published : Dec 29, 2022, 10:15 AM IST

Updated : Dec 29, 2022, 3:26 PM IST

Kandukuru Deaths History : నెల్లూరు జిల్లా కందుకూరు చంద్రబాబు సభ తొక్కిసలాటలో మృతిచెందినవారంతా టీడీపీ కార్యకర్తలే. తమ అభిమాన నేతను చూసేందుకు వచ్చి.. తోపులాటలో ప్రాణాలు విడిచారు. మృతి చెందిన వారందరిదీ నిరుపేద కుటుంబ నేపథ్యం కావడంతో విషాదఛాయలు అలుముకున్నాయి

చిన్నప్పటి నుంచి టీడీపీ అభిమానం:కందుకూరు తెలుగుదేశం బహిరంగసభలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రవీంద్రబాబుది ఉలవపాడు మండలం ఆత్మకూరు. రెండు ఎకరాల భూమిలో సాగు చేస్తూ ఇద్దరు కుమారులకు పెళ్లిళ్లు చేయగా.. వారూ వ్యవసాయమే చేస్తున్నారు. రవీంద్రబాబుకి చిన్నప్పటి నుంచి టీడీపీ అభిమానం. ఎలాగైన చంద్రబాబును చూడాలని ఉదయమే కందుకూరుకు వెళ్లారని..ఇంతలోనే తొక్కిసలాటలో మృతి చెందారని కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

కుటుంబమంతా టీడీపీ అభిమానులే:వరిచేను సంగానికి చెందిన యాకసరి విజయమ్మ దినసరి కూలీ కాగా ఆమె భర్త హైదరాబాద్‌లో బేల్దారి పనులు చేస్తుంటారు. వీరికి ముగ్గురు పిల్లలు. వీరు కూడా కూలీ పనికి వెళ్తున్నారు. విజయమ్మ, తన తండ్రి కోటేశ్వరరావుతో కలసి చంద్రబాబు సభకు వచ్చారు. ఈ ఘటనలో కోటేశ్వరరావుకు గాయాలవ్వడంతో ఆసుపత్రిలో చేరారు. కందుకూరుకు చెందిన కాకుమాని రాజా కుటుంబమంతా టీడీపీ అభిమానులే. కూల్‌డ్రింక్‌ దుకాణం నిర్వహిస్తున్న రాజాకు భార్య కల్యాణి, ఇద్దరు పిల్లలున్నారు. కుమారుడు చైతన్య చెన్నైలో ఇంజినీరింగ్‌ చదువుతుండగా, కుమార్తె లక్ష్మీ ప్రణతి కందుకూరులో 9వ తరగతి చదువుతోంది. కుటుంబ పెద్ద చనిపోవడంతో వారంతా కన్నీరు మున్నీరు అవుతున్నారు.

చంద్రబాబు సభ కోసమే:కందుకూరు నాంచారమ్మ కాలనీకి చెందిన ఊదుమూరి రాజేశ్వరి గృహిణి. భర్త కృష్ణ ఎలక్ట్రీషియన్‌. రాజేశ్వరి సోదరుడు మధు టీడీపీ రాష్ట్ర బీసీ సెల్‌ నాయకుడు కావడంతో.. చంద్రబాబును చూసేందుకు వచ్చి..తొక్కిసలాటలో మృతిచెందారు. గుడ్లూరు మండలం అమ్మవారిపాలేనికి చెందిన మర్లపాటి చినకొండయ్య హైదరాబాద్‌లో బేల్దారి పనులు చేస్తుంటారు. ఆయనకు ఇద్దరు పిల్లలు. కందుకూరులో చంద్రబాబు సభ కోసమే రెండు రోజుల క్రితం హైదరాబాద్‌ నుంచి వచ్చి ప్రాణాలు కోల్పోవడంతో విషాదం నెలకొంది. కొండముడుసుపాళేనికి చెందిన కలవకూరి యానాది పొలం పనులు చేస్తుంటారు. ఈయన టీడీపీ ఎస్సీ సెల్‌ నాయకుడు. ఈయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పిల్లలందరికీ పెళ్లిళ్లు అయ్యాయి.

కూలీ పనులు చేసుకుంటూ:కందుకూరు మండలం ఓగూరుకు చెందిన గడ్డం మధుబాబు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలు. వారంతా చదువుకుంటున్నారు. మధుబాబు మృతితో ఆ కుటుంబం దిక్కులేనిదైంది.

అభిమాననేతను చూడాలని.. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన టీడీపీ అభిమానులు..

ఇవీ చదవండి

Last Updated : Dec 29, 2022, 3:26 PM IST

ABOUT THE AUTHOR

...view details