Suspicious death: కేబుల్ వైర్లకు వేలాడుతూ మృతదేహం కనిపించిన ఘటన నెల్లూరు నగరంలో కలకలం రేపింది. నిత్యం రద్దీగా ఉండే లస్సీ సెంటర్ వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో డీఎస్పీ అబ్దుల్ సుభాన్ ఘటనాస్థలికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
నెల్లూరులో కలకలం.. కేబుల్ వైర్లకు వేలాడుతూ మృతదేహం - Suspicious death
Suspicious death: నిత్యం రద్దీగా ఉండే రోడ్డు.. నగరం నడిబొడ్డు.. విద్యుత్ స్తంబాలకు ఉన్న కేబుల్ వైర్లకు ఓ మృతదేహం వేలాడుతూ కనిపించింది. ఆందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
dead body