ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెన్నా నదిలో గల్లంతైన యువకుడి మృత దేహం లభ్యం - పెన్నా నదిలో ఈతకు వెళ్లి గల్లంతైన వ్యక్తి న్యూస్

నెల్లూరు జిల్లా రేవూరు సమీపంలోని పెన్నా నదిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యమైంది. పోలీసులు స్థానికులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టి మృతదేహన్ని వెలికితీశారు.

పెన్నానదిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
పెన్నానదిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

By

Published : May 31, 2020, 9:02 PM IST

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం రేవూరు గ్రామం వద్ద ఈతకు వెళ్లి మృతి చెందిన యువకుడి మృతదేహం లభ్యమైంది. రవీంద్ర అనే యువకుడు నిన్న తన నలుగురు స్నేహితులతో కలిసి పెన్నానదిలోకి సరదాగా ఈతకు వెళ్లాడు. నీటి ప్రవాహం ఎక్కవగా ఉండటంతో ప్రమాదవశాత్తు తన నలుగురు స్నేహితులు నీటిలో కొట్టుకుపోతుండగా రవీంద్ర వారిని రక్షించాడు.

చివరికి నీటి ఉద్ధృతి ఎక్కువ అయిన కారణంగా... రవీంద్ర ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. సాయంత్రం సమయంలో గాలింపు చేయడం కష్టంగా మారటంతో ఈరోజు ఉదయం పోలీసులతో కలిసి స్థానికులు గాలించగా మృతదేహం గట్టుకు రావడాన్ని గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details