ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దమ్ముంటే నా పర్యటనను అడ్డుకోండి: పవన్‌ - వైకాపాపై పవన్ విమర్శలు

వైకాపా ప్రభుత్వంపై శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పర్యటనలో పవన్ ఘాటు విమర్శలు చేశారు. తన పర్యటనను అడ్డుకోవడానికి రాష్ట్రం ఏమైనా వైకాపా జాగీరా అని ప్రశ్నించారు. తాము తిరగబడితే వైకాపా నాయకులు ఇబ్బందుల్లో పడతారని హెచ్చరించారు.

pawan kalyan
pawan kalyan

By

Published : Dec 4, 2020, 3:32 PM IST

రాష్ట్రం వైకాపా జాగీరు కాదని... అందరికీ సమాన హక్కులున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తుపాను ప్రభావంతో పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన... రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ పర్యటనను అడ్డుకోవాలని వైకాపా నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆయన... ప్రతిదాడి కావాలంటే జనసేన కార్యకర్తలు సిద్ధమని హెచ్చరించారు. దమ్ముంటే తన పర్యటనను అడ్డుకుని చూడండి అంటూ సవాల్ విసిరారు. తాము తిరగబడితే వైకాపా నాయకులు ఇబ్బందుల్లో పడతారని తెలిపారు.

అలాగే కొందరు పోలీసులు వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పవన్ ఆరోపించారు. తాను పోలీసు కుటుంబం నుంచి వచ్చానని.... కొందరు పోలీసులు తీరు మార్చుకోకపోతే గుర్తుపెట్టుకుంటానని అన్నారు.

దమ్ముంటే నా పర్యటనను అడ్డుకోండి: పవన్‌

ABOUT THE AUTHOR

...view details