ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధ్వానంగా ఆత్మకూరు రోడ్లు.. వాహనదారులకు తప్పని ఇక్కట్లు - Government Performance in Nellore District.

వర్షాలకు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఎక్కడికక్కడ గుంతలు పడటం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలకు గురై గాయాలపాలవుతున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అధ్వానంగా ఆత్మకూరు రోడ్లు
అధ్వానంగా ఆత్మకూరు రోడ్లు

By

Published : Dec 8, 2020, 3:36 PM IST

పది రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో రోడ్లు గుంతలమయంగా మారాయి. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు‌ ఎదుర్కొంటున్నారు. ఆత్మకూరు నుంచి సోమశిల, నెల్లూరుపాళెం, బైపాస్ రోడ్డు, అప్పారావుపాళెం వెళ్లే రోడ్లు దారుణంగా తయారయ్యాయి.

అసలే అంతంత మాత్రంగా ఉన్న రహదారులు వర్షాలకు ఇంకా అధ్వానంగా తయారయ్యాయి. వాహనదారులు ప్రమాదాలకు గురై గాయాలపాలవుతున్నారు. మంత్రి గౌతమ్ రెడ్డి సొంత నియోజకవర్గంలో పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details