నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట నుంచి కోట వాకాడు రోడ్డు 25కిలోమీటర్లు మేర ఉంది. వాకాడు స్వర్ణముఖి నది ఇసుక టిప్పర్లు నిరంతరం ఈ దారి గుండా తిరగడంతో రోడ్లు దెబ్బతింటున్నాయని స్థానికులు చెబుతున్నారు. భారీ బరువుతో టిప్పర్లు చెన్నై వైపు వెళ్తున్నాయి. ఇవి అడ్డూఅదుపు లేకుండా తిరుగుతున్నాయని తెలిపారు. ప్రశ్నిస్తే జైల్లో వేస్తామని ఇసుక రవాణాదారులు బెదిరిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
రోడ్డుకు దగ్గరలో నివాసం ఉండే తాము దుమ్ము ధూళితో తిప్పలు పడుతున్నామని ప్రజలంటున్నారు. ఇసుక రవాణా, అక్రమ రవాణా వాహనాలతో రోడ్డు ధ్వంసం అవుతోందని ఆరోపిస్తున్నారు. గుంతల రోడ్లలో రాకపోకలకు వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నడుము లోతు గుంతలు పడిన రోడ్లపై ప్రయాణిస్తే ఏ సమయంలో ఏం జరుగుతుందోనని భయపడుతున్నట్లు పలువురు వాపోతున్నారు.