ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం..దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన - తుపాను ఏయే ప్రాంతాల్లో విస్తరిస్తోంది

Cyclone in the Bay of Bengal: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం..తుఫానుగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను ప్రభావంతో తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హెచ్చరింది.

బంగాళాఖాతంలో వాయుగుండం
బంగాళాఖాతంలో వాయుగుండం

By

Published : Dec 7, 2022, 10:05 AM IST

Updated : Dec 7, 2022, 6:11 PM IST

Cyclone in the Bay of Bengal: బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం.. ఈ సాయంత్రానికి తుపానుగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఈ వాయుగుండం.. చెన్నైకి 500కిలో మీటర్లకుపైగా దూరంలో కేంద్రీకృతమైందని ఇండియన్​ మెట్రోలాజికల్​ (ఐఎమ్​డీ) తెలిపింది. ఇది క్రమంగా..పశ్చిమ వాయవ్యం వైపు దిశగా కదులుతూ సాయంత్రానికి తుపానుగా బలపడే సూచనలు ఉన్నట్టు తెలియచేసింది.

గురువారం ఉదయానికి ఇది ఉత్తర తమిళనాడు-దక్షిణ కోస్తాంధ్రతీరాలకు దగ్గరగా వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఆ తదుపరి 48 గంటల పాటు ఇది తమిళనాడు కోస్తాంధ్ర తీరాల వెంబడి కొనసాగుతుందని..దీని ప్రభావంతో ఈ నెల 8 తేదీ నుంచి 3రోజుల పాటు.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణశాఖ అధికారులు వివరించారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హెచ్చరించారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 7, 2022, 6:11 PM IST

ABOUT THE AUTHOR

...view details