నెల్లూరు జిల్లాలో ఫొని తుపాను ప్రభావం 29,30 తేదీల్లో ఉంటుందని... జిల్లా అధికారులంతా సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ముత్యాలరాజు సూచించారు. కృష్ణపట్నం రేవులో ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు మధ్యాహ్నం లోపు తీరానికి రావాలని కోరారు. ప్రస్తుతం తుపాను శ్రీహరికోటకు 1423 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు. జిల్లాలోని తీరం వెంబడి ఉన్న 13 మండలాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం తడిసిపోకుండా, ఫాస్ట్ ట్రాక్ విధానంలో కొనుగోళ్లు జరపాలన్నారు.
కృష్ణపట్నం పోర్టులో ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ - phoni
ఫొని తుపాను ప్రభావంతో కృష్ణపట్నం పోర్టులో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
ఫొని ప్రభావం
Last Updated : Apr 28, 2019, 8:26 AM IST