CS JAWAHAR REDDY TELECONFERENCE WITH COLLECTORS : మాండౌస్ తుపాను కారణంగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎస్ జవహర్‌రెడ్డి టెలీకాన్ఫరెన్సు ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. వర్షపు నీరు తగ్గిన వెంటనే పంట నష్టం అంచనా వేయాలని ఆదేశించారు. ఇవాళ ఉదయం వరకూ అన్నమయ్య జిల్లాలో 23.3 మిల్లీమీటర్లు, చిత్తూరులో 30.5, ప్రకాశం 14.1, నెల్లూరు 57.6, తిరుపతి 75.7, కడప 4.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు విపత్తు నిర్వహణా సంస్థ అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు.. కలెక్టర్లతో సీఎస్ జవహర్‌రెడ్డి టెలీకాన్ఫరెన్సు - సీఎస్ జవహర్ రెడ్డి టెలీకాన్ఫరెన్సు
CS JAWAHAR REDDY TELECONFERENCE: మాండౌస్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎస్ జవహర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. తుపాన్ ఎఫెక్ట్ ఉన్న ఆయా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్సు ద్వారా వివరాలు తెలుసుకున్నారు.

CS JAWAHAR REDDY TELECONFERENCE
గడచిన 24 గంటల్లో ఆరు జిల్లాల్లో 109 ప్రాంతాల్లో 64.5 మిల్లీ మీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదైందని తెలిపారు. తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో 2 పశువులు, గొర్రెలు మృతిచెందాయని, కచ్చాఇళ్లు దెబ్బతిన్నట్టు టెలికాన్ఫరెన్సులో అధికారులు సీఎస్‌కు వివరించారు.
ఇవీ చదవండి: