ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరు రైతులకు త్వరలో పంట పరిహారం - నెల్లూరులో పంట నష్టం

వరుసగా కుదేలవుతున్న అన్నదాతకు.. నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ కొంతలో కొంత ఉపసమనం కలిగించే వార్తను తెలిపింది. పంట నష్టపోయిన రైతులకు మరో నాలుగైదు నెలల్లో పరిహారం అందనుందని సహాయ సంచాలకులు నరసోజీరావు వెల్లడించారు. ఇప్పటికే అంచనాలను ప్రభుత్వానికి పంపించామని ప్రకటించారు.

compensation to farmers
నెల్లూరు వ్యవసాయ సహాయ సంచాలకులు నరసోజీ రావు

By

Published : Oct 16, 2020, 8:23 PM IST

వర్షాల ధాటికి పంట నాశనమైన రైతులకు నెల్లూరులోని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు నరసోజీ రావు తీపి కబురు అందించారు. సెప్టెంబరులో కురిసిన వానల వల్ల పంట కోల్పోయిన అన్నదాతలకు నాలుగైదు నెలల్లో పరిహారం అందుతుందని వెల్లడించారు. బ్యాంకు ఖాతాలో నగదు జమ అయిన వెంటనే రైతులు తమకు తెలియచేయాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా 2,772 మంది కర్షకులు, రూ. 2 కోట్ల 83 లక్షల మేర నష్టపోయినట్లు.. ప్రభుత్వానికి నివేదిక పంపామని తెలిపారు.

వరి, వేరుశనగ, మినుము, పెసర పంటలు గత నెలలో వానలకు భారీగా దెబ్బతిన్నాయని నరసోజీ రావు పేర్కొన్నారు. వరి-1767, వేరుశనగ-107, కంది-9, పెసర-7, మొక్కజొన్న-2 హెక్టార్ల చొప్పున మొత్తం 1,902 హెక్టార్లలో రైతులు నష్టపోయారని వివరించారు.

ఇదీ చదవండి:నెల్లూరులో ఉద్రిక్తత... నిరసనకారులు, పోలీసుల మధ్య తోపులాట

ABOUT THE AUTHOR

...view details