ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అకాల వర్షాలకు నీట మునిగిన పంట పొలాలు - Crop Fields Damaged in Nellore Latest News

నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలకు పొలాలన్నీ నీట మునిగాయి. ఫలితంగా పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో అన్నదాతలు ఆందోళన చెందుతూ సర్కారు సాయాన్ని అర్థిస్తున్నారు.

అకాల వర్షాలకు నీట మునిగిన పంట పొలాలు
అకాల వర్షాలకు నీట మునిగిన పంట పొలాలు

By

Published : Nov 14, 2020, 3:34 PM IST

రెండు రోజులగా కురుస్తున్న వర్షాలకు నెల్లూరు జిల్లాలో వరి, మినుము, వరి నారుమళ్లు దెబ్బతిన్నాయి. జిల్లాలోని బోగోలు, దగదర్తి, జలదంకి మండలంలో పంటలు నీట మునిగి దెబ్బతిన్నాయి.

అకాల వర్షాలకు నీట మునిగిన పంట పొలాలు

ప్రభుత్వమే ఆదుకోవాలి..

వరి 200 హెక్టార్లు, వరి నారుమళ్లు 200 హెక్టార్లు, మినుము 10 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. దెబ్బతిన్న పంటలను వ్యవసాయ అధికారులు పరిశీలిస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు.

అకాల వర్షాలకు నీట మునిగిన పంట పొలాలు

ఇవీ చూడండి : తెలుగు ప్రజలకు సీఎం జగన్ శుభాకాంక్షలు

ABOUT THE AUTHOR

...view details