నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రాంతీయ వైద్యశాలలో అమానవీయ ఘటన జరిగింది. మంగళవారం రాత్రి ప్రాణాపాయ స్థితిలో వచ్చిన ఓ అధ్యాపకుడికి డ్యూటీ డాక్టర్ ఇంజెక్షన్ వేసి వదిలేశారు. బాధితుడికి రోడ్డు ప్రమాదంలో తల, కాళ్లకు తీవ్ర గాయాలవగా సెక్యురిటీ గార్డులు, స్వీపర్లే బ్యాండేజీ కట్టారు. అక్కడినుంచి నెల్లూరు జీజీహెచ్‌కు తరలిచేందుకు స్ట్రెచర్‌లో తీసుకెళ్తుండగా ఆ బ్యాండేజీ సైతం ఊడింది. ఆత్మకూరు ఆస్పత్రిలో వైద్యులు లేకపోవడం, డ్యూటీ డాక్టర్ ఉన్నా సరిగా స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రి వైద్యుల నిర్వాకం.. సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లతో చికిత్స - Criticisms of Atmakuru government hospital Doctor
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రిలో అమానవీయ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో గాయాలైన వ్యక్తికి .. వైద్యుడు విధుల్లో ఉన్నా సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు చికిత్స అందించారు. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి వచ్చిన వ్యక్తిని పట్టించుకోకపోవటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రి
Last Updated : May 11, 2022, 11:06 AM IST