నెల్లూరు నగరంలోని ప్రభుత్వ వైద్యశాల కొవిడ్ కేర్ సెంటర్ ను సీపీఎం నేతల బృందం పరిశీలించింది. సౌకర్యాలు మెరుగుపరచాలని కోరుతూ వారు వైద్యాధికారులకు వినతిపత్రం అందజేశారు. కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు వెంటనే వచ్చేలా చర్యలు చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్రా రాజగోపాల్ కోరారు.
'కరోనా కేసులు పెరుగుతున్నాయి..పడకల సంఖ్య పెంచండి' - సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్రా రాజగోపాల్
నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నందున పడకల సంఖ్య పెంచాలని సీపీఎం డిమాండ్ చేసింది.
'కరోనా కేసులు పెరుగుతున్నందున జిల్లాలో పడకల సంఖ్య పెంచాలి'
పెరుగుతున్న కేసులకు తగట్లు కరోనా బాధితుల కోసం జిల్లాలో 15వేల పడకలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. వైద్యులతోపాటు సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించి, హోం ఐసోలేషన్ లో ఉన్న వారి పర్యవేక్షణకు ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేయ్యాలని , అవసరమైన మందులు, పౌష్టికాహారం ప్రభుత్వమే అందించాలని కోరారు.