ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. సీపీఎం ప్రచారోద్యమం - నెల్లూరు జిల్లా తాజా వార్తలు

రాష్ట్రానికి ద్రోహం చేసిన భాజపా విధానాలను ఎండగడదాం అంటూ సీపీఎం పిలుపునిచ్చింది. భాజపాకు మద్దతుగా పనిచేస్తున్న వైకాపా, తెదేపా , జనసేనలను నిలదీద్దాం అంటూ ప్రచారోద్యమాన్ని చేపట్టింది. ఈ రోజు నుంచి 15వ తేది వరకు దేశంలో ప్రచారోద్యమం నిర్వహిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు.

cpm protest
cpm protest

By

Published : Nov 7, 2020, 6:12 PM IST

రాష్ట్రానికి ద్రోహం చేసిన భాజపాతో కలిసి వైకాపా, తెదేపా, జనసేన పార్టీలు పనిచేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. నెల్లూరులో పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహానికి పూలమాల వేశారు. పార్టీలన్నీ ప్రజలకు సమాధానం చెప్పాలని మధు నిలదీశారు. పార్టీల పరిస్థితులపై 15 వ తేది వరకు దేశ వ్యాప్తంగా ప్రచారోద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details