సీపీఎం కేంద్ర కమిటీ చేపట్టిన దేశవ్యాప్త నిరసనలో భాగంగా నెల్లూరులో ఆ పార్టీ ఆందోళన చేపట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ... నగరంలోని సచివాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రవేటుపరం చేసే ప్రయత్నాలను విరమించాలని డిమాండ్ చేశారు. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవాలని కోరారు.
'కరోనాతో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకోవాలి' - nellore latest news
నెల్లూరులోని సచివాలయం ఎదుట సీపీఎం నాయకులు ఆందోళన చేశారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కరోనాతో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకోవాలని కోరారు.

నెల్లూరులో సీపీఎం నేతల ఆందోళన