కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలపై పార్టీలకతీతంగా గ్రామగ్రామాన ఉద్యమాలను ఉద్ధృతం చేసి చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాటం చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి పట్టణంలో రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన రైతు సదస్సులో పాల్గొని ప్రసంగించారు.
"కేంద్ర ప్రభుత్వం ఆచరణలోకి తెచ్చిన చట్టాలు కార్పొరేట్ సంస్ధలకు అనుకూలంగా ఉన్నాయి. చట్టాల వల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. రైతుల పేరు చెబుతూ కార్పొరేట్ సంస్థలకు స్వేచ్ఛ కలిగించేలా చట్టాలను తయారు చేసింది. చట్టాల వల్ల ధరల నియంత్రణ లేకుండాపోతుంది. ఈ చట్టాలు భవిష్యత్తులో రైతులకు ఉరితాడుగా మారుతాయి".-శ్రీనివాస రావు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు