ప్రజారోగ్యాన్ని కాపాడాలంటూ నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాల ఎదుట సీపీఎం ఆందోళన చేపట్టింది. కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కరోనా కేసులు పెరుగుతున్నందున జిల్లాలో కోవిడ్ హాస్పిటల్స్ సంఖ్య పెంచాలన్నారు.
తగినంత మంది వైద్యులు, సిబ్బందిని నియమించాల్సిన అవసరముందని సీపీఎం నేత మాదాల వెంకటేశ్వర్లు చెప్పారు. ప్రైవేటు వైద్యశాలల కరోనా పేరుతో చేస్తున్న దోపిడీని అరికట్టాలని, వైద్య, ఆరోగ్య రంగాలకు ప్రభుత్వాలు అధిక శాతం నిధులు కేటాయించాలని కోరారు.