నెల్లూరు జిల్లా అనంతసాగరం తహసీల్దార్ కార్యాలయం వద్ద వ్యసాయ కార్మిక సంఘం, సీఐటీయూ, సీపీఎం నేతలు ధర్నాకు దిగారు. కేంద్రంలో భాజపా రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా వ్యతిరేక విధానాలను వేగవంతం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వరంగ సంస్థలను, స్వదేశీ, విదేశీ కార్పొరేట్ సంస్థలకు కారుచౌకగా అమ్ముతుందని ధ్వజమెత్తారు. రక్షణరంగాన్ని మెుదలుకొని అన్ని రంగాలను అమ్మేస్తున్నారనీ... ఒక పాలకపదవులు తప్ప అని ఎద్దేవా చేశారు. కార్మిక ఉద్యోగుల హక్కుల్ని కాలరాస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర అమలు చేసే విధానాలతో కౌలు రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధర రైతులకు అందటం లేదని వాపోయారు.
అనంతసాగరం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన - cpm agitation in anantasagaram news
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయంటూ.. నెల్లూరు జిల్లా అనంతసాగరం తహసీల్దార్ కార్యాలయం వద్ద సీఐటీయూ, సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ సంస్థలను కారు చౌకగా అమ్మేస్తున్నారని ఆరోపించారు.
సీఐటీయూ సీపీఎం నేతల నిరసన