నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం మల్లెమాల గ్రామస్థులు భూమి కోసం ఆందోళనకు దిగారు. వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో పెద్ద ఎత్తున సీపీఐ నాయకులు పాల్గొన్నారు. దశాబ్దాల క్రితం పేదలకు ఇచ్చిన భూములు, ఇళ్ల స్థలాల పేరిట లాక్కోవటం ఏంటని ఈ సందర్భంగా జల్లి విల్సన్ ప్రశ్నించారు. పేదల నుంచి తీసుకున్న భూములకు కొత్తగా పట్టాలు ఇచ్చే చర్యలు మానుకోవాలని హితవు పలికారు. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సు మేరకు ప్రభుత్వ భూములు పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
'అప్పుడు ఇచ్చిన భూములకు ఇప్పుడు పట్టాలేంటి?' - మల్లెమాల గ్రామంలో మాజీ ఎమ్మెల్సీ విల్సన్ ఆందోళన
దశాబ్దాల క్రితం పేదలకు ఇచ్చిన భూములు లాక్కొని, ఆ స్థలాలకు కొత్తగా పట్టాలు ఇవ్వటం ఏంటని మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా మల్లెమాల గ్రామస్థులకు భూ పంపిణీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
!['అప్పుడు ఇచ్చిన భూములకు ఇప్పుడు పట్టాలేంటి?' cpi vilson agitation in mallemala village](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6288727-265-6288727-1583307538142.jpg)
మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ ఆధ్వర్యంలో ఆందోళన