రాజకీయాల్లో దాడుల సంస్కృతి మంచి పద్ధతి కాదని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(cpi ramakrishna) అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నివాసంపై.. ఎమ్మెల్యే జోగి రమేష్ దాడికి ప్రయత్నించడాన్ని ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు.
బెదిరింపులకు దిగడం మంచి సంస్కృతి కాదు..
రాజకీయాలు ప్రజాస్వామ్య పద్ధతిలో చేయ్యాలే తప్ప.. దౌర్జన్యాలు, బెదిరింపులకు దిగడం మంచి సంస్కృతి కాదని రామకృష్ణ అన్నారు. తెదేపా నేతలు కూడా వ్యక్తిగత దూషణలకు దిగడం సరైందికాదన్నారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ..నెల్లూరు నగరంలో సీపీఐ పాదయాత్ర చేపట్టింది. ఆర్టీసీ బస్టాండ్ నుంచి మద్రాస్ బస్టాండ్, విఆర్సీ, గాంధీబొమ్మ మీదుగా.. పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహం వరకు పాదయాత్ర చేశారు.
ఉక్కు పరిశ్రమను పరిరక్షించాలి
కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రానికి అన్ని విధాలా అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. విశాఖ ఉక్కును ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతోందని దుయ్యబట్టారు. ఉక్కు పరిశ్రమను పరిరక్షించాలంటూ.. ఈ నెల 27న భారీ ప్రదర్శన నిర్వహించునున్నట్లు రామకృష్ణ తెలిపారు. వ్యవసాయాన్ని ప్రైవేటుపరం చేయడాన్ని ఖండిస్తూ.. 27వ తేదీన జరిగే భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి:
CHANDRABABU: చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తతలపై కేసులు నమోదు