నెల్లూరు జిల్లా కావలి మండలం మద్దూరుపాడు క్వారంటైన్ కేంద్రంలో కనీస సౌకర్యాలు కూడా లేవని అక్కడ చికిత్స పొందుతున్న కొవిడ్ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేంద్రంలో ఎక్కడా పరిశుభ్రత కనిపించదని తెలిపారు.
కొవిడ్ నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయిన వారి గదులను శుభ్రపరచకుండానే ఇతర కరోనా బాధితులకు ఇస్తున్నారు. ఆహారంలో నాణ్యత లేదు. వంద రూపాయల విలువ చేసే ఆహారం కూడా పెట్టడం లేదు. ఆక్సిజన్ సిలిండర్లు, శరీర ఉష్ణోగ్రతను కొలిచే పరికరాలు లేవు. కూర్చోవడానికి కుర్చీ, చెత్త డబ్బాలు ఇక్కడ కనిపించవు. సమస్యలపై ప్రశ్నిస్తే డిశ్చార్జి చేస్తామని బెదిరిస్తున్నారు- కొవిడ్ బాధితురాలు