ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Anandhayya party: ఆనందయ్య కొత్త పార్టీ.. త్వరలో రథయాత్ర.. - కృష్ణపట్నం ఆనందయ్య తాజా వార్తలు

కొవిడ్‌ నివారణ మందు పంపిణీ చేసిన.. కృష్ణపట్నం ఆనందయ్య రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. త్వరలో రాజకీయ పార్టీ వివరాలు ప్రకటిస్తానని ఆనందయ్య వెల్లడించారు.

Anandhayya party
Anandhayya party

By

Published : Sep 29, 2021, 1:10 PM IST

కొవిడ్​ రెండో దశలో.. మందు పంపిణీ చేసి గుర్తింపు పొందిన నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. త్వరలో రాజకీయ పార్టీ వివరాలు ప్రకటిస్తానని ఆనందయ్య వెల్లడించారు. యాదవ సంఘం జాతీయ నాయకుల ఆధ్వర్యంలో పార్టీ పెట్టనున్నట్లు తెలిపారు. త్వరలో దేశవ్యాప్తంగా రథయాత్ర నిర్వహిస్తామన్నారు.

కరోనా నివారణ మందు తయారీకి ప్రభుత్వం సహకరించలేదని ఆనందయ్య ఆరోపించారు. అఖిల భారతీయ యాదవ మహాసభ 13 జిల్లాల సమాఖ్య సమావేశ యాత్ర సభ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆనందయ్య మాట్లాడుతూ ఆయుర్వేద మందు పంపిణీ విషయంలో విద్యుత్తు సరఫరాకు అనుమతులు ఇవ్వమని కోరినా ఎన్‌వోసీ రాలేదన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో 13 జిల్లాల్లో రథయాత్ర నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.

ఇదీ చదవండి: Anandaiah Medicine: 'ప్రభుత్వం నుంచి అనుమతులే తప్ప సహకారం లేదు'

ABOUT THE AUTHOR

...view details