PRC issue : పీఆర్సీ సమస్య పరిష్కారం కాకుండానే చర్చలు సఫలమని ఉద్యోగ సంఘాలు ప్రకటించడం దారుణమని.. నెల్లూరులో న్యాయ శాఖ ఉద్యోగి సురేష్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి జరిగిన చర్చలు సఫలం కాదు, విఫలమంటూ.. ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు. గాంధీ విగ్రహం ముందు బైఠాయించి.. ఉద్యోగుల పీఆర్సీని న్యాయబద్ధంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఫిట్ మెంట్, డీఏ, ఏరియర్స్ గురించి ఎక్కడా ఊసేలేదని, ఇంత ఉద్యమం చేస్తే హెచ్.ఆర్.ఏ. రెండు శాతమే పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, సీ.పీ.ఎస్. రద్దు గురించి ఎలాంటి హామీ లేకున్నా.. జేఏసీ చర్చలు సఫలమని ప్రకటించడం అన్యాయమన్నారు.