నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చుంచులూరు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కడప జిల్లా సిద్ధవటం మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన భార్య భర్తలు పెంచలకోనకు దైవదర్శనానికి వెళుతున్నారు. ఓ లారీ వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొనటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని... మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
చుంచులూరు జాతీయ రహదారిపై ప్రమాదం... భార్యభర్తలు మృతి - నెల్లూరు జిల్లా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
నెల్లూరు జిల్లా చుంచులూరు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో భార్యభర్తలిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
చుంచులూరు జాతీయ రహదారిపై ప్రమాదంలో ఇద్దరు మృతి