ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరు జిల్లాలో కరోనాతో దంపతులు మృతి - Couple dies with corona

కరోనా మహమ్మరి కారణంగా నెల్లూరు జిల్లాలో దంపతులు మరణించారు. వారికి వారం రోజుల క్రితం వైరస్ సోకగా నాలుగు రోజుల క్రితం భర్త, మంగళవారం భార్య మృతి చెందారు.

నెల్లూరు జిల్లాలో కరోనాతో దంపతులు మృతి
నెల్లూరు జిల్లాలో కరోనాతో దంపతులు మృతి

By

Published : Apr 28, 2021, 5:35 PM IST

నెల్లూరు జిల్లాలోని ఓ కుటుంబలో కరోనా వైరస్ విషాదాన్ని నింపింది. భర్త విద్యాశాఖ జిల్లా సమన్వయర్త కాగా పని చేస్తుండగా.. భార్య గ్రామంలో ఉపాధ్యాయినిగా పనిచేస్తోంది. వీరికి ఇద్దరు సంతానం. వారం రోజుల క్రితం దంపతులిద్దరికి కరోనా సోకగా.. మహమ్మరి దాటికి నాలుగు రోజుల క్రితం భర్త మరణించాడు. ఈ విషయాన్ని భార్యకు తెలియనివ్వకుండా అతని మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆ తర్వాత భార్య ఆరోగ్యం విషమంగా మారటంతో చెన్నై తరలించారు. మంగళవారం ఆమె కూడా మృతి చెందింది. దంపతులిద్దరిని కరోనా బలి తీసుకోగా..పిల్లలు ఒంటరిగా మిగిలారు.

ABOUT THE AUTHOR

...view details