ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

SUICIDE: అక్కతో పెళ్లి..మరదలితో ప్రేమ..చివరికి..! - నెల్లూరు జిల్లా వార్తలు

నెల్లూరు జిల్లాలో పెన్నానది సమీపంలో ఓ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడు రోజుల కిందట అదృశ్యమైన వీరు.. విగత జీవులుగా కనిపించారు.

ఆత్మహత్య
ఆత్మహత్య

By

Published : Sep 12, 2021, 1:16 PM IST

అక్కను పెళ్లి చేసుకున్నాడు..మరదలితో సాన్నిహిత్యంగా మెలిగాడు..అది వివాహేతర సంబంధానికి దారితీసి.. ఇద్దరి ప్రాణాల్ని బలి తీసుకుంది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామానికి చెందిన వెంకటేష్​కు శ్రీలేఖతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కూలి పని చేసుకుని జీవించే వెంకటేష్​కు మరదలితో సాన్నిహిత్యం ఏర్పడింది. దీంతో వెంకటేష్ కుటుంబంలో కలతలు మొదలయ్యాయి. విషయం బయటపడటంతో వెంకటేష్, అతని మరదలు ఈనెల ఏడవ తేదీన ఇంట్లో నుంచి వెళ్లిపోయారు.

జొన్నవాడ సమీపంలోని పెన్నా నది కాలువ సమీపంలో ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు మృతుడు వెంకటేష్‌ తల్లి గీత ఇచ్చిన ఫిర్యాదుతో నెల్లూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధమే వీరి ఆత్మహత్యకు కారణమని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:కొత్తజంటను నిర్భంధించడంతో ఆలయం వద్ద గందరగోళం

ABOUT THE AUTHOR

...view details