ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యువ జంట ఆత్మహత్యాయత్నం... భర్త మృతి

ప్రేమించి వివాహం చేసుకున్నారు. నూరేళ్లు... సంతోషంగా కలిసి నడవాలనుకున్నారు. కుటుంబ కలహాలు వారి ఆనందాన్ని మంటగలిపాయి. భార్యభర్తలిద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

death
మరణించిన వ్యక్తి

By

Published : May 17, 2021, 8:32 AM IST

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిలలో విషాదం జరిగింది. కొత్తగా పెళ్లైన జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో భర్త మరణించగా.. భార్య పరిస్థితి విషమంగా ఉంది.

ఏం జరిగింది:

గ్రామానికి చెందిన యువ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు… ఆరు నెలలుగా కుటుంబం నుంచి వేరుగా ఉంటున్నారు. కుటుంబ కలహాల వల్ల భర్త శ్రీకాంత్​ పెట్రోల్​ పోసుకుని నిప్పంటించుకున్నాడు. విషయం తెలుసుకున్న భార్య పురుగుల మందు తాగింది. వైద్యం అందించేందుకు ఇద్దరినీ… నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భర్త మృతి చెందాడు. భార్య పరిస్థితి విషమంగా ఉంది.

ఇదీ చదవండి:

కరోనాతో సినీగేయ రచయిత అదృష్ట దీపక్‌ మృతి

ABOUT THE AUTHOR

...view details