ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఉపాధిహామీ పనుల్లో రూ. 2.71 లక్షల అవినీతి' - మండల పరిషత్ కార్యాలయం ఉదయగిరి

నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో జరిగిన ఉపాధిహామీ పనుల్లో రూ.2.71 లక్షల అవినీతి జరిగినట్లు అధికారులు వెల్లడించారు. 2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి వరకు మండలంలోని పలు గ్రామాల్లో వివిధ శాఖలకు కేటాయించిన పనుల్లో అవకతవకలు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.

corruption in udayagiri mandal mgnrega  funds
ప్రిసైడింగ్ అధికారి సతీష్ బాబు

By

Published : Dec 29, 2020, 5:43 PM IST

నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో జరిగిన ఉపాధిహామీ పనుల్లో రూ. 2.71 లక్షల అవినీతి జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. 2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి వరకు ఉదయగిరి మండలంలోని 17 పంచాయతీల్లో జరిగిన ఉపాధి పనులపై సామాజిక తనిఖీ బృందాలు క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. మండలంలో ఉపాధి హామీ, పంచాయతీ రాజ్, గృహ నిర్మాణ శాఖ, సెర్ప్, పశుసంవర్ధక శాఖ, సోషల్ ఫారెస్ట్ ద్వారా 1453 పనులకు రూ.6,58,31,801 నిధులను ఖర్చు చేసి పనులు చేశారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద నిర్వహించిన సామాజిక తనిఖీ ప్రజావేదికలో ఆయా పనుల్లో రూ. 2,71,070 అవినీతి జరిగినట్లు ప్రిసైడింగ్ అధికారి సతీష్ బాబు తేల్చారు. అలాగే ఉదయగిరి మేజర్ పంచాయతీలో రూ. 36,14,896 నిధులతో జరిగిన పనులపై పునః పరిశీలన చేయాలని ఏపీడీ, క్వాలిటీ కంట్రోల్ అధికారులను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details