ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పట్టణ ప్రాంతాల్లోనే కరోనా కేసులు ఎక్కువ: కలెక్టర్ శేషగిరిబాబు

నెల్లూరు జిల్లాలో పట్టణ ప్రాంతాల్లోనే కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్నాయని జిల్లా కలెక్టర్​ శేషగిరిబాబు వెల్లడించారు. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జిల్లాలో సుమారు 50 వేల మంది సిబ్బంది వైరస్ నివారణకు కృషి చేస్తున్నారని చెప్పారు.

nellore collector
nellore collector

By

Published : Apr 9, 2020, 1:50 PM IST

నెల్లూరు జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని నెల్లూరు జిల్లా కలెక్టర్‌ శేషగిరిబాబు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని ఆయన వెల్లడించారు. ముందుజాగ్రత్తగా పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేశామన్నారు. కొవిడ్‌ ఆస్పత్రులుగా గుర్తించిన నెల్లూరు జీజీహెచ్​, నారాయణ ఆస్పత్రుల్లో మెరుగైన ఏర్పాట్లు చేశామని చెప్పారు. కరోనా నివారణ కోసం జిల్లాలో 50 వేల మంది సిబ్బంది పని చేస్తున్నారని వెల్లడించారు. ప్రసుత్తం హోం క్వారంటైన్‌లో సుమారు 750 మంది ఉన్నారని అందరి ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో వెంటిలేటర్ల కొరత లేదని వివరించారు. అవసరమైతే ప్రైవేట్‌ ఆస్పత్రుల నుంచి తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే నిత్యావసరాల ధరలు పెంచితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

కలెక్టర్​ శేషగిరిబాబుతో ముఖాముఖి

ABOUT THE AUTHOR

...view details