నెల్లూరులో కరోనా వైరస్ తొలి కేసు నమోదు - నెల్లూరులో కరోనా వైరస్ తొలి కేసు నమోదు
నెల్లూరులో కరోనా వైరస్ తొలి కేసు నమోదైంది. నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలోని ప్రత్యేక వార్డులో యువకుడికి చికిత్స అందిస్తున్నారు. యువకుడు 14 రోజుల క్రితం ఇటలీ నుంచి వచ్చాడు. కరోనా వైరస్ లక్షణాలున్నట్లు వైద్యుల ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. పూర్తి నివేదిక కోసం నమూనాలను పుణెకు పంపించారు.
corona virus case in nellore