ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాకు అన్నం పెట్టరా..!? నెల్లూరు జీజీహెచ్ లో కరోనా బాధితుల ఆగ్రహం - కరోనా బాధితుల నిరసన

నెల్లూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్యతో పాటు...ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి బాధితుల కష్టాలూ పెరుగుతున్నాయి. జీజీహెచ్​లో ఆహారం, సదుపాయాలు, సిబ్బంది తీరు పట్ల బాధితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమస్యలను ఏకరవు పెడుతూ ఆ వీడియోలను బంధువులతో పంచుకున్నారు. తమ గోడు ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు.

నెల్లూరు జీజీహెచ్‌లో కరోనా బాధితుల నిరసన
నెల్లూరు జీజీహెచ్‌లో కరోనా బాధితుల నిరసన

By

Published : Jul 13, 2020, 4:44 AM IST

Updated : Jul 13, 2020, 8:32 PM IST

నెల్లూరు జీజీహెచ్​ కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులు..అక్కడి సదుపాయాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సకాలంలో ఆహారం, మందులు కూడా అందిచడం లేదంటూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కేటాయించిన గదుల్లోకి వైద్యులు, నర్సులు రావడం లేదన్నారు. మందులు ఎప్పుడు, ఎలా వేసుకోవాలో సూచించేవారే కరవయ్యారంటూ వాపోయారు.

జీజీహెచ్​లో ఎదుర్కొంటున్న సమస్యలను బాధితులు ఫోన్‌ ద్వారా ఆసుపత్రి అధికారులకు వివరించారు. సుమారు 40 మందిని ఒకే వార్డులో ఉంచి... కేవలం రెండు మరుగుదొడ్లు మాత్రమే అందుబాటులో ఉంచారని సిబ్బందిపై మండిపడ్డారు. ఇతర ఆసుపత్రులకు వెళ్లాలన్నా.. పంపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో మరింత అసహనానికి గురయ్యారు.

జీజీహెచ్​లో ఇలాంటి పరిస్థితుల్లోనే మరికొన్ని రోజులు ఉంటే... తమ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడం ఖాయమని బాధితులు కలవరపడుతున్నారు.

ఇదీచదవండి రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 1933 కరోనా కేసులు...19 మరణాలు

Last Updated : Jul 13, 2020, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details