నాయుడుపేటలో కరోనా నిర్ధరణ పరీక్షలు - corona tests to vegetables sellers at naidupeta
నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. కోయంబేడు మార్కెట్ నుంచి కూరగాయలు దిగుమతి చేసేవారిలో ఆరుగురికి కరోనా వైరస్ సోకడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.
![నాయుడుపేటలో కరోనా నిర్ధరణ పరీక్షలు corona tests held at naidupeta in nellore](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7149797-473-7149797-1589182675679.jpg)
నాయుడుపేటలో కరోనా నిర్ధరణ పరీక్షలు
నెల్లూరు జిల్లా నాయుడుపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో... కరోనా వైరస్ నిర్దరణ పరీక్షలు నిర్వహించారు. చెన్నై కోయంబేడు మార్కెట్ నుంచి కూరగాయలు దిగుమతి చేసుకునే వ్యాపారులు, డ్రైవర్లు, కూలీ పనిచేసే వారి నుంచి నమూనాలు సేకరించారు. సూళ్లూరుపేటలో... కోయంబేడు మార్కెట్ నుంచి కూరగాయలు దిగుమతి చేసేవారిలో ఆరుగురికి కరోనా వైరస్ సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.