నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నేడు జిల్లాలో 6 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటివరకు 90 కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మృతిచెందారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశాల మేరకు సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని రోడ్లు, ఇళ్ల గోడలపై పిచికారీ చేయిస్తున్నారు. మురికి కాల్వలు శుభ్రం చేయించి బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. నెల్లూరు, కావలి, గూడూరు, నాయుడుపేట, వాకాడు, తడ తదితర ప్రాంతాల్లో ఫాగింగ్ చేస్తున్నారు. గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.
నెల్లూరు జిల్లాలో పారిశుద్ధ్య పనులు ముమ్మరం
నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నందున పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామాలు, పట్టణాల్లో రహదారులపై రసాయన ద్రావణం పిచికారీ చేయిస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం