చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి విధుల్లో ఉన్న ఏఎస్సై గర్భవతి అయిన తన భార్యను 5 రోజుల క్రితం చికిత్స నిమిత్తం నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం చిలమత్తూరు ఆసుపత్రికి తీసుకొచ్చారు. వచ్చే ముందు కాళహస్తిలో కరోనా పరీక్ష చేయించుకున్నారు. వాటికి సంబంధించిన ఫలితాలు ఈరోజు వచ్చాయి. ఆయనకు పాజిటివ్ అని తేలింది. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామంలో కొందరి నుంచి నమూనాలు సేకరించారు. పోలీసులు చేరుకుని వైద్యుల ద్వారా నమూనాలు సేకరించారు.
పోలీసుకు కరోనా... భార్యను తిరుపతికి తరలింపు - covid news in nellore dst
కరోనా పాజిటివ్ వచ్చిన ఏఎస్సై భార్య నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం చిలమత్తూరులో చికిత్స పొందుతోంది. పోలీసుకు పాజిటివ్ రాగా... అధికారులు ఆమెను హుటాహుటిన తిరుపతి ఆసుపత్రికి తరలించారు.
కేసు వివరాలు చెపుతున్న అధికారి
TAGGED:
covid news in nellore dst