నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణం బంగారు పేట బీసీ కాలనీలో ఇద్దరు చిన్నారులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. చెన్నైకు చెందిన 13 ఏళ్ల బాలుడు, 12 ఏళ్ల బాలిక ఇటీవల ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు. వీరిద్దరికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి పరీక్షలు చేయించగా నిన్న అందిన ఫలితాల్లో వైరస్ సోకినట్టుగా నిర్థరణ అయ్యింది.
ఆ ఇద్దరు చిన్నారులను నెల్లూరు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుకు తరలించారు. కుటుంబంలోని మిగతా వారిని గూడూరులోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. వీరు ఉన్న ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. పురపాలక శాఖ ఆధ్వర్యంలో.. ముందు జాగ్రత్త చర్యలు అమలు చేశారు.