ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కరోనా బాధితులకు యోగాసనాలు ఎంతో ఉపయోగకరం' - ఆత్మకూరు నేటి వార్తలు

నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని కొవిడ్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న రోగులకు... యోగాసనాల శిక్షణ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. పురపాలక సంస్థ కమిషనర్, స్థానిక సీఐలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

corona patients doing yoga in athmakuru nellore district
కొవిడ్ కేంద్రంలో యోగా చేస్తున్న బాధితులు

By

Published : Aug 26, 2020, 4:39 PM IST

కరోనా బాధితుల్లో ఉన్న ఆందోళనలు, భయాన్ని తొలగించి... ఆరోగ్యాన్ని అందిచేందుకు యోగాసనాలు ఎంతో ఉపయోగపడతాయని నెల్లూరు జిల్లా ఆత్మకూరు పురపాలక కమిషనర్ రమేష్ బాబు తెలిపారు. పట్టణంలో టిడ్కో భవనాల్లోని కొవిడ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

స్థానిక ఆర్డీఓ ఉమాదేవి, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సలహాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రమేష్ బాబు అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారం కొవిడ్ కేంద్రానికి పూర్తి భద్రత కల్పిస్తున్నామని పట్టణ సీఐ సోమయ్య చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details