గూడూరు కొవిడ్ కేర్ సెంటర్లో సదుపాయాలు సరిగ్గా లేవని కరోనా పాజిటివ్ బాధితులు నిరసనకు దిగారు. వేడినీళ్లు కాదు కదా.. మంచినీరే లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. భోజనాలు సరిగ్గా పెట్టడం లేదని.. వైద్యం అందటం లేదని ఆరోపించారు. మందులు సైతం సమయానికి ఇవ్వటం లేదని వాపోయారు. ముఖ్యమంత్రిగా జగన్ను గెలిపించినందుకు ఏం చేస్తున్నారంటూ నిలదీశారు. ఇటువంటి పరిస్థితుల్లో కొవిడ్ కేర్ సెంటర్లో ఉండలేమనీ.. తమకు హోం క్వారంటైన్లో ఉంటామని.. ఇళ్లకు పంపించాలని డిమాండ్ చేశారు.
సదుపాయాలు లేవని కరోనా బాధితుల ఆందోళన
వేడి నీళ్లు కాదు కదా.. మంచి నీరు కూడా లేదు.. సరైన సదుపాయాలు లేవు..మరుగుదొడ్లు శుభ్రం చేయటం లేదు..మేము ఇక్కడ ఉండలేము.. హోం క్వారంటైన్లో ఉంటామంటూ నెల్లూరు జిల్లా గూడూరు కొవిడ్ కేర్లో ఉంటున్న కరోనా బాధితులు వేడుకుంటున్నారు.
కరోనా బాధితుల ఆందోళన