CORONA: నెల్లూరు జిల్లా ఓజిలిలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. ఒక్కసారిగా పాఠశాలలోని 40 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. పాఠశాలలో 280 మంది గిరిజన బాలబాలికలు... ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుకుంటున్నారు. మూడు రోజుల క్రితం నిర్వహించిన పరీక్షల్లో 40 మందికి కరోనా పాజిటివ్ రావడంతో.. వైద్యం అందించి హోం ఐసోలేషన్‌కు పంపారు. ప్రస్తుతం వీరందరూ ఆరోగ్యంగా ఉన్నట్లు పాఠశాల సిబ్బంది తెలిపారు. విద్యార్థులు సంక్రాంతి సెలవులకు ఇళ్లకు వెళ్లి వచ్చే సమయంలోనే.. జలుబు, దగ్గు, జ్వరంతో వచ్చినట్లు తెలిపారు. దీంతో వైద్యపరీక్షలు నిర్వహించారు. ప్రిన్సిపల్ సిబ్బందికి కూడా పాజిటివ్ రావడంతో.. ఉన్నతాధికారులు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
CORONA: గురుకుల పాఠశాలలో కరోనా కలకలం.. 40 మంది విద్యార్థులకు పాజిటివ్ - నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు
CORONA: నెల్లూరు జిల్లా ఓజిలిలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. ఒక్కసారిగా పాఠశాలలోని 40 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. పాఠశాలలో 280 మంది గిరిజన బాలబాలికలు... ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుకుంటున్నారు.
గురుకుల పాఠశాలలో కరోనా కలకలం.. 40 మంది విద్యార్థులకు పాజిటివ్