ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

corona cases: చిట్టేడు గురుకులంలో కొవిడ్‌ కలకలం.. - nellore corona latest updates

నెల్లూరు జిల్లా చిట్టేడు గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల, పాఠశాలలో 19 మంది విద్యార్థులు, ఓ అధ్యాపకుడు కొవిడ్‌ బారిన పడ్డారు. వీరందరినీ మెరుగైన చికిత్స నిమిత్తం గూడూరులోని ప్రాంతీయ వైద్యశాలలో చేర్పించినట్లు కోట మండల వైద్యాధికారి నాగరాజు శుక్రవారం తెలిపారు.

కరోనా కలవరం
కరోనా కలవరం

By

Published : Sep 4, 2021, 7:46 AM IST

నెల్లూరు జిల్లా చిట్టేడు గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల, పాఠశాలలో 19 మంది విద్యార్థులు, ఓ అధ్యాపకుడు కొవిడ్‌ బారిన పడ్డారు. వీరందరినీ మెరుగైన చికిత్స నిమిత్తం గూడూరులోని ప్రాంతీయ వైద్యశాలలో చేర్పించినట్లు కోట మండల వైద్యాధికారి నాగరాజు శుక్రవారం తెలిపారు. మరోవైపు గ్రామంలోనూ నాలుగు కేసులు నమోదయ్యాయి. ఐటీడీఏ పీవో కనకదుర్గా భవాని, అభివృద్ధి అధికారి రోశిరెడ్డి, తహసీల్దారు పద్మావతి, ఎంపీడీవో భవాని గురుకులాన్ని సందర్శించారు. మిగిలిన విద్యార్థుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ప్రిన్సిపల్‌ విజయలక్ష్మికి సూచించారు. 100 మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details