బారా షహీద్ దర్గాలో సాంప్రదాయబద్ధంగా జరిగే ప్రార్థనకు కొద్దిమంది మత పెద్దలతో నిర్వహించేందుకు అధికారులు అనుమతిచ్చారు. నేటి నుంచి మూడో తేదీ వరకు రొట్టెల పండగ జరగాల్సి ఉంది. సాయంత్రం దర్గా ఆవరణలో మూజావర్ల ప్రత్యేక ప్రార్థనలతో పండగ ప్రారంభమౌతుంది. సోమవారం రాత్రి గంధ మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమాలకు కేవలం 20 మందినే అనుమతిస్తున్నారు. స్వర్ణాల చెరువులో ఇచ్చిపుచ్చుకునే కోర్కెల రొట్టెలను ఈసారి పూర్తిగా నిలిపివేశారు. ఇప్పటికే దర్గా ప్రాంగణాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకొని ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి, రాకపోకలను నిషేధిస్తున్నారు.
కరోనా ఎఫెక్ట్: ఈసారి ఇచ్చిపుచ్చుకునే కోర్కెల రొట్టెలు లేనట్లే..!
మత సామరస్యానికి ప్రతీకగా ఏటా లక్షలాది మంది భక్తులతో వేడుకగా జరిగే నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండగ కొవిడ్ కారణంగా వెలవెలబోతోంది. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ఈసారి పండగను అధికారులు రద్దు చేశారు.
corona effect on nellore rottela panduga