నెల్లూరు జిల్లాలో లాక్డౌన్ సడలింపు అనంతరం కరోనా కేసులు వేగంగా విజృంభిస్తున్నాయి. ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 36 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు జిల్లాలో 443 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకొని 258 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఐసోలేషన్ కేంద్రాల్లో 177 మంది చికిత్స పొందుతుండగా.. మొత్తం ఏడుగురు మృతి చెందారు. క్వారంటైన్ కేంద్రాల్లో 528 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.
లాక్డౌన్ సడలింపులతో విజృంభిస్తోన్న కరోనా - corona latest news update
లాక్డౌన్ సడలింపులతో నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు మరింతగా పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 36 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు జిల్లాలో 443 కేసులు నమోదు కాగా.. ఏడుగురు మృతి చెందారు.
లాక్డౌన్ సడలింపులతో విజృంభిస్తోన్న కరోనా
ఇవీ చూడండి..