తమిళనాడులోని కోయంబేడు మార్కెట్‌లో భారీగా పాజిటివ్ కేసులు బయటపడటం.. చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు లింకులున్నట్లు ఐదు రోజుల క్రితమే జిల్లా అధికారులకు సమాచారం అందిన నేపథ్యంలో అధికార యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు, నెల్లూరు మార్కెట్లపై ప్రత్యేక దృష్టి సారించి వ్యాపారులు, వాహన డ్రైవర్లు, హమాలీలకు విరివిగా పరీక్షలు నిర్వహించారు. సుమారు 300 మందికి పైగా పరీక్షించగా.. ప్రాథమికంగా సూళ్లూరుపేటకు చెందిన 21 మంది, నెల్లూరుకు చెందిన ముగ్గురు.. మొత్తం 24 మందిని అనుమానితులుగా అధికారులు గుర్తించారు. ఇందులో 18 మందికి ప్రెజ్యూమ్ పాజిటివ్ రాగా.. 6 మందిని పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతం 9 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. సూళ్లూరుపేట, తడ ప్రాంతాలకు చెందిన వీరందరినీ నెల్లూరుకు తరలించి పర్యవేక్షిస్తున్నారు. నిర్ధరణ అయిన 9 మంది సూళ్లూరుపేటకు చెందిన వారు కాగా.. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారు. ఆరంబాకం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి పరీక్షల పరిశీలనలో ఉండగా.. అతని కుటుంబ సభ్యులను పరీక్షించాలని తమిళనాడు అధికారులకు జిల్లా అధికారులు సూచించారు.
ముమ్మర చర్యలు