నెల్లూరు జిల్లా నాయుడుపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఎంఎన్‌వోగా పనిచేస్తున్న వ్యక్తి భార్యకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. బాధితురాలిని నెల్లూరులోని ఐసోలేషన్‌కు తరలించారు. ఆమె కుటుంబ సభ్యులు చెన్నైలో ఉండటం.. వారిని ఈమె కలవడంతో వైరస్ సోకిందని అధికారులు చెబుతున్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు వైద్య సేవలు చేసే వ్యక్తి భార్యకు వైరస్ రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. వీరు నివాసం ఉంటున్న ప్రాంతంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు.
ఎంఎన్‌వో భార్యకు కరోనా పాజిటివ్..
నెల్లూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. నాయుడుపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఎంఎన్‌వోగా పనిచేస్తున్న వ్యక్తి భార్యకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
corona cases in nellore